వ్యవసాయ బిల్లులపై మారు మాట్లాడకుండా మద్దతిచ్చాడు బాబు: విజయసాయిరెడ్డి

  • స్వామినాథన్ కమిటీ రిపోర్టు అమలు చేయాలి
  • కనీస మద్దతు ధర ఉండాల్సిందే
  • వైసీపీ ఎంపీలమైన మేము పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడాం
  • మూడు వ్యవసాయ బిల్లులపై ఒక్క సవరణైనా సూచించావా బాబూ?  
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతోన్న రైతులు ఇచ్చిన బంద్ పిలుపునకు దేశ వ్యాప్తంగా స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై స్పందిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

‘వ్యవసాయ బిల్లులపై మారు మాట్లాడకుండా మద్దతిచ్చాడు బాబు. స్వామినాథన్ కమిటీ రిపోర్టు అమలు చేయాలని, కనీస మద్దతు ధర ఉండాల్సిందేనని, వైసీపీ ఎంపీలమైన మేము పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడాం. మూడు వ్యవసాయ బిల్లులపై ఒక్క సవరణైనా సూచించావా బాబూ? చంద్రబాబుకు హెరిటేజ్ ప్రయోజనాలే ఎక్కువైపోయాయి’ అంటూ విమర్శలు గుప్పించారు.

Vijay Sai Reddy
YSRCP
Chandrababu

More Telugu News